రేపటి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతి

25-12-2018 Tue 11:05 | Both States
  • 6వ తేదీ వరకు సందర్శించే అవకాశం
  • సందర్శన వేళలు ఉదయం 10 నుంచి సాయంత్రం 4  
  • వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే వాహనాల ద్వారా లోపలికి ప్రవేశం
శీతాకాల విడిదిలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రామ్ నాథ్ కోవింద్ బస చేసి వెళ్లిన విషయం తెలిసిందే. 2011 నుంచి రాష్ట్రపతి పర్యటనకు వచ్చి తిరిగి వెళ్లిన అనంతరం ఈ నిలయం సందర్శనకు వారం రోజుల పాటు ప్రజలకు అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా రేపటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రజలను అనుమతించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి నిలయం అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు సందర్శించవచ్చు. తమ వాహనాలపై ఇక్కడికి వచ్చే ప్రజలు రాష్ట్రపతి నిలయం ఎదుట ఉన్న పార్కింగ్ స్థలంలో వాటిని ఉంచాలి. వృద్ధులు, దివ్యాంగులు మాత్రం తమ వాహనాల ద్వారా రాష్ట్రపతి నిలయంలోకి ప్రవేశించవచ్చు. కాగా, రాష్ట్రపతి నిలయంలో సుమారు 20 గదులకు పైగా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అతిథుల కోసం, కార్యాలయ నిర్వహణకు, సమావేశాల నిర్వహణకు  కేటాయించారు. దట్టమైన చెట్లు, వనమూలికా తోట, ఆయుర్వేద మొక్కలు ఈ ప్రాంగణంలో ఉన్నాయి.    
bollaramrastapathi nilayamramnath kovind

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more